గత కొన్ని రోజులుగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు గురవుతూ వస్తున్నాయి. తాజాగా ధర పెరిగి షాక్ ఇచ్చిన పసిడి.. ఇప్పుడు కాస్త దిగొచ్చింది. శ్రావణ మాసం, పెళ్లిళ్ల సీజన్, వరుస పండుగలు రావడంతో బంగారం ధర పెరిగింది. అయితే గత మూడు రోజులుగా మాత్రం బంగారం ధర కాస్త తగ్గు ముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా పసిడి ధర తగ్గిపోయింది. దీంతో చాలామంది గోల్డ్ దుకాణాలకు క్యూ కడుతున్నారు. ఔన్స్ కు 1919 డాలర్లు వరకు అంతర్జాయ మార్కెట్ లో కొనసాగుతుంది.
కాగా వెండి రేట్ మాత్రం 23 డాలర్లపైనే ట్రేడ్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణాల్లో.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 150, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ. 160 తగ్గింది. దీంతో గురువారం (సెప్టెంబర్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 55వేలు, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60వేల వద్ద కొనసాగుతుంది. ఇక వెండిపై రూ. 500 తగ్గింది. గత మూడు రోజులుగా చూసుకుంటే వెండి రూ.1500 తగ్గింది. ప్రస్తుతం రూ.78,500 కొనసాగుతుంది.