కేంద్రం నుంచి జెన్ టెక్నాలజీస్‌కు భారీ ఆర్డర్లు

Update: 2023-09-06 04:19 GMT

దేశ రక్షణపై ఎక్కువగా దృష్టి సారించిన కేంద్రం.. అనేక రక్షణ పరికరాలు, ఆయుధాలకై వాటి సంబంధిత కంపెనీలకు ఆర్డర్లను ఇస్తుంది. దీంతో ఆయా కంపెనీల షేర్లు భారీగా లాభపడుతున్నాయి. తాజాగా డ్రోన్ తయారీ సంస్థ జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్‌కు మరోసారి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఆర్డర్ వచ్చింది. దీంతో మంగళవారం కంపెనీ షేర్ ధరలో విపరీతమైన పెరుగుదల కనిపించింది. వారం రెండో ట్రేడింగ్ రోజున స్టాక్ దాదాపు 3 శాతం పెరుగుదలతో రూ.840కి చేరుకుంది. గత ఆగస్టు 17న షేరు ధర రూ.912.55కి చేరుకుందని 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసింది




 


రక్షణ శాఖ జెన్ టెక్నాలజీస్ రూ.123.3 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందింది. ఒక నెల కాలంలో కంపెనీ పొందిన మూడో ఆర్డర్ ఇది. ఆగస్టు 31న కంపెనీ.. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రూ.72.29 కోట్ల విలువైన ఆర్డర్‌ను గెలుచుకుంది. అంతకుముందు ఆగస్టు 12న కంపెనీ రూ.65 కోట్ల విలువైన మరో ఆర్డర్‌ను పొందింది. జూన్-సెప్టెంబర్ మధ్య కాలంలో కంపెనీ మొత్తంగా రూ.733 కోట్లు విలువైన ఆర్డర్లను పొందింది. ఇది జూన్ త్రైమాసికంలో ఆర్డర్ బుక్ రూ.542 కోట్ల కంటే ఎక్కువ. పన్నులు మినహాయిస్తే కంపెనీ ప్రస్తుత ఆర్డర్ బుక్ రూ.1,275 కోట్లుగా ఉంది. ఈ ఆర్డర్ బుక్‌లోని మొత్తం ఆర్డర్‌లలో ట్రైనింగ్ సిమ్యులేటర్‌లు సగం వరకు ఉండగా.. మిగిలినవి కౌంటర్ డ్రోన్ సిస్టమ్‌లు, సర్వీసుల నుంచి వచ్చాయి.




 


జూన్‌లో జెన్ టెక్నాలజీస్ ఎండీ అశోక్ అట్లూరి మాట్లాడుతూ.. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆర్డర్ బుక్ 20 శాతం పెరుగుదల ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 2023 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జెన్ టెక్నాలజీస్ షేర్ ధర దాదాపు 350 శాతం పెరుగుదలను నమోదు చేసింది.




 




Tags:    

Similar News