AP SSC Hall Tickets 2024 : పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు విడుదల!

Byline :  Bharath
Update: 2024-03-03 10:39 GMT

పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రకటించింది. మార్చి 4 మధ్యాహ్నం 12 గంటల నుంచి https://bse.ap .gov.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయని చెప్పింది. స్కూళ్ల లాగిన్ తోనే కాకుండా విద్యార్థులు కూడా నెట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు ఉదయం 9: 30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఏపీలో పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ సంవత్సరం 6 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.




 


ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్:

మార్చి 18- ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1

మార్చి 19- సెకండ్ లాంగ్వేజ్

మార్చి 20- ఇంగ్లీష్

మార్చి 22- మ్యాథ్స్‌

మార్చి 23- ఫిజికల్ సైన్స్

మార్చి 26- బయాలజీ

మార్చి 27- సోషల్ స్టడీస్

మార్చి 28- ఫస్ట్‌ లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1

మార్చి 30- ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), ఓకేషనల్ కోర్సు పరీక్ష ఉంటుంది.




Tags:    

Similar News