Singareni Recruitment 2024 : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..జాబ్ నోటిఫికేషన్ విడుదల
(Singareni Recruitment 2024) తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ వరుసగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తూ వస్తోంది. ఇప్పటికే 563 పోస్టులతో గ్రూప్1 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇక త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ మరో శుభవార్త చెప్పింది. సింగరేణిలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపింది. ఈ తరుణంలో నేడు సింగరేణి సీఎండీ బలరామ్ నాయక్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో 272 పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్ విడుదలైంది. అందులో ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (మైనింగ్) పోస్టులు 139 ఉన్నాయి.ఈ పోస్టులకు మార్చి 1వ తేదీ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయని, మార్చి 18వ తేదీన దరఖాస్తులకు ఆఖరు తేదిగా నిర్ణయించారు. ఈ పోస్టులకు https://scclmines.com/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఉద్యోగ సంస్థ: సింగరేణి సంస్థ
ఖాళీలు : 272
ఉద్యోగ వివరాలు:
ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (మైనింగ్) పోస్టులు 139,
మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఐఈ) - 10,
జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ -10,
మేనేజ్‌మెంట్ ట్రైనీ (హైడ్రో–జియాలజిస్ట్) - 02,
మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్) -18,
మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎఫ్ అండ్ ఏ) - 22,
మేనేజ్‌మెంట్ ట్రైనీ (పర్సనల్) - 22,
జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ - 3,
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ - 30
నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో సబ్ ఓవర్సీస్ ట్రైనీ (సివిల్) - 16
వయోపరిమితి : వైద్యాధికారి పోస్టు మినహా మిగిలిన పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తులు ప్రారంభం : మార్చి 1, 2024.
దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు : మార్చి 18, 2024.
అధికారిక వెబ్ సైట్ : https://scclmines.com/