TS Inter Exams 2024 : ఇవాళ్టి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. రూల్స్ ఇవే..

Byline :  Krishna
Update: 2024-02-28 02:03 GMT

తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ ఎగ్జామ్స్ ఇవాళ్టి నుంచి జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు బోర్డు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇవాళ్టి నుంచి మార్చి 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12వరకు పరీక్షలు జరగనున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఎగ్జామ్స్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. కాపీయింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు.

ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు చెల్లించలేదన్న కారణాలతో హాల్ టికెట్లు ఇవ్వలేదనే ఇబ్బందులు లేకుండా నేరుగా విద్యార్థులే ఆన్ లైన్లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే వెసులు బాటు కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1521 సెంటర్లను ఏర్పాటు చేశారు. 27 వేల 900 మంది ఇన్విజిలేటర్లు, 75 ఫ్లయింగ్‌ స్క్వాడ్ టీమ్స్, 1521 చీఫ్ సూపరింటెండెంట్స్, 200 మంది సిట్టింగ్ గార్డ్స్ను నియమించారు. అత్యవసర వైద్య సేవలకు ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉంటారు. మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే డిబార్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు కూడా పెడతామని ఇంటర్ బోర్డు సెక్రటరీ తెలిపారు. మానసిక ఒత్తిడికి గురికాకుండా విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాయాలని.. ఏదైనా మానసిక ఒత్తిడి ఉంటే విద్యార్థుల కోసం టెలి మానస్ పేరుతో14416 లేదా 1800-914416 టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి కౌన్సిలింగ్ తీసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.

ఈ నేప‌థ్యంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో విద్యార్థుల‌కు ఆర్టీసీ బ‌స్సులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామ‌ని గ్రేట‌ర్ హైద‌రాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు తెలిపారు. ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులు రాయితీ బ‌స్ పాస్, హాల్ టికెట్ చూపించి ప్ర‌యాణించొచ్చ‌ని సూచించారు. రాయితీ బ‌స్ పాస్‌ లేని విద్యార్థులకు నామమాత్రపు ధరతో టికెట్‌ జారీ చేస్తారని వివరించారు. ఉదయం 7 గంటల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు అన్నీ రూట్లలో బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఎక్కడైన బస్సుల రాకపోకల్లో ఆలస్యమైతే కోఠి-9959226160, రేతిఫైల్‌-9959226154 నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.


Tags:    

Similar News