Mega DSC Notification : తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

Byline :  Krishna
Update: 2024-02-29 06:26 GMT

తెలంగాణలో టీచర్ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ను విద్యాశాఖ అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. గత డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేసిన ప్రభుత్వం.. ఇవాళ కొత్త నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఇందులో ఎస్జీటీ 6508 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ 2629, లాంగ్వేజ్ పండిట్ 727,పీఈటీ 182 పోస్టులు ఉన్నాయి.

ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. కాగా ఎన్నికలకు ముందు గత బీఆర్ఎస్ సర్కార్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 6న 5089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. దీనికి 1.77 లక్షల మంది అప్లై చేశారు. అయితే నవంబర్లో జరగాల్సిన పరీక్షలను అసెంబ్లీ ఎన్నికల వల్ల వాయిదా వేశారు. రాష్ట్రంలో 1.22 లక్షల టీచర్ పోస్టులకు గాను.. 1.03 లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందుకే మెగా డీఎస్సీని విడుదల చేసి 11 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News