బైజూస్‌కు వ్యతిరేకంగా ఇన్వెస్టర్లు దావా

By :  Shabarish
Update: 2024-02-23 15:30 GMT

ఆర్థిక సంక్షోభం వల్ల పలు కంపెనీలు మూతపడ్డాయి. ఇంకొన్ని కంపెనీలు తమ సంస్థలోని ఉద్యోగులను తొలగించాయి. కంపెనీపై ఉన్న ఆర్థిక భారాలను తొలగించుకునేందుకు ఉద్యోగుల కోత, జీతాల కోత వంటివి చేపట్టాయి. వాటిల్లో ఎడ్ టెక్ సంస్థ అయిన బైజూస్ కూడా ఉంది. ఈ సంస్థ కూడా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని తీవ్ర నష్టాలను చవిచూసింది. అయితే తాజాగా ఆ కంపెనీలోని నలుగురు ఇన్వెస్టర్ల గ్రూప్ కోర్టును ఆశ్రయించింది.

బెంగళూరులోని నేషనల్ లా ట్రిబ్యునల్‌లో ఇన్వెస్టర్ల గ్రూప్ లోని నలుగురు బైజూస్ సీఈఓ రవీంద్రన్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. కంపెనీలో వేధింపులు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బైైజూస్ యాజమాన్యానికి వ్యతిరేకంగా బెంగళూరు ఎన్సీఎల్టీ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు కంపెనీ వార్షిక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశం రోజునే ఇన్వెస్టర్ల గ్రూప్ కోర్టును ఆశ్రయించడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

కంపెనీ ఫౌండర్, సీఈఓ అయిన జైజూ రవీంద్రన్ సహా కంపెనీ బోర్డు సభ్యులను తొలగించాలని, కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని ఇన్వెస్టర్ల గ్రూప్స్ డిమాండ్ చేశాయి. అలాగే కంపెనీ ఆర్థిక లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలని ఇన్వెస్టర్ల సభ్యులు కోరారు. దీనిపై బైజూస్ యాజమాన్యం స్పందించింది. ఇన్వెస్టర్లు పిటిషన్ వేసిన విషయం తమకు తెలియదని, వదంతులపై తాము స్పందించబోమని స్పష్టం చేసింది.


Tags:    

Similar News