1930 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

Byline :  Shabarish
Update: 2024-03-08 16:24 GMT

కేంద్ర ప్రభుత్వం నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. మొత్తం 1930 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 7వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటన వెలువడింది.

మొత్తం నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు: 1,930

యూఆర్‌ కేటగిరీలో పోస్టుల వివరాలు: 892

ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో పోస్టుల వివరాలు: 193

ఓబీసీ కేటగిరీలో పోస్టుల వివరాలు: 446

ఎస్సీ కేటగిరీలో పోస్టుల వివరాలు: 235

ఎస్టీ కేటగిరీలో పోస్టుల వివరాలు: 164

దివ్యాంగుల కేటగిరీలో పోస్టుల వివరాలు: 168

ముఖ్యమైన తేదీల వివరాలు:

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: మార్చి 7, 2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 27, 2024.

దరఖాస్తు సవరణ తేదీలు: మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 03, 2024 వరకు.

రాత పరీక్ష తేదీ: జులై 07, 2024.

లింక్: https://upsc.gov.in


Tags:    

Similar News