పక్కా ప్లాన్తోనే.. సింగోటం కేసులో సంచలన విషయాలు

By :  Bharath
Update: 2024-02-09 13:59 GMT

నాగర్ కర్నూల్ కు చెందిన బీజేపీ నేత సింగోటం రాములు హత్యకు గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని యూసుఫ్ గుడ పరిధిలో అర్ధరాత్రి ఆయన హత్య జరిగింది. అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ గా ఉన్న సింగోటం.. ఆటో డ్రైవర్ నుంచి చేపల ఎగుమతిచేసే స్థాయికి ఎదిగారు. కొంతకాలంగా సోషల్ సర్వీస్ చేస్తున్న ఆయన.. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో చేరిన రాములు.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించారు. కాగా ఆయన హత్యవిషయంలో దర్యాప్తు చేసిన పోలీసులు పలు కీలక అంశాలు బయటపెట్టారు.

సింగోటం రాములును పక్కా ప్లాన్ ప్రకారం నాగర్ కర్నూల్ నుంచి రప్పించి హత్య చేసినట్లు గుర్తించారు. మొదట రాములును హనీట్రాప్ చేసి హత్య చేశారు. రాములును హనీట్రాప్ చేసి.. హైదరాబాద్ కు రప్పించారు. ఆ తర్వాత హత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తేల్చారు. ఆ సమయంలో మహిళతో పాటు ఆమె కూతురిపై కూడా రాములు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో రౌడీషీటర్లను.. జిలానీ, మనీలకు చెప్పి సదురు మహిళ రాములును హత్య చేయించిది. ప్రస్తుతం హత్యకు కారణమైన యువతి పోలీసుల అదుపులో ఉంది.


Tags:    

Similar News