అయోధ్య రామమందిరం పేరుతో మెసేజ్​ వచ్చిందా? తస్మాత్​ జాగ్రత్త!

By :  Bharath
Update: 2024-01-13 11:38 GMT

సైబర్ నేరగాళ్లు వాళ్లకు అందొచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టడంలేదు. అమాయకపు ప్రజల ఆసక్తని.. క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నారు. ఈసారి ఏకంగా అయోధ్య రామ మందిరంపై పడ్డారు. గతకొన్ని రోజులుగా దేశంలో రామమందిర ప్రాణప్రతిష్ట హాట్ టాపిక్ గా ఉంది. ఎన్నో ఏళ్లుగా కోట్లాది మంది హిందువులు ఈ ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల కళ్లు రామమందిరంపై పడ్డాయి. ప్రారంభోత్సవ ఈవెంట్ ను క్యాష్ చేసుకోవాలని కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వీఐపీ టికెట్లను.. వాట్సాప్ లో పంపిస్తున్నారు. వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలని, ఈ లింక్స్ పై క్లిక్ చేస్తే వ్యక్తిగత డేటా, బ్యాంక్ ఖాతా వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడే అవకాశం ఉంది.

ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ‘‘అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఈవెంట్​కు వీఐపీ టికెట్లు కావాలా? అయితే ఈ లింక్​ క్లిక్​ చేయండి. డైరక్ట్​గా ఈ ఏపీకే ఫైల్​ ను డౌన్​లోడ్​ చేసుకోండని మీకు వాట్సాప్​లో మెసేజ్​ వచ్చిందా? అయితే తస్మాత్​ జాగ్రత్త! ఇలాంటి మెసేజ్​లోని లింక్స్​ క్లిక్​ చేసినా, ఏపీకే ఫైల్స్​ డౌన్​లోడ్​ చేసినా.. ఇక అంతే! మీ డేటాను సైబర్ నేరగాళ్లు దోచుకుంటారు. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్​ వివరాలన్నీ తస్కరించి మోసాలకు తెగబడుతార’’ని ట్వీట్ లో చెప్పుకొచ్చారు.




Tags:    

Similar News