Rose Gold Beauty Parlour: బ్యూటీ పార్లర్‌ ప్రాంచైజీ పేరుతో రూ.2 కోట్ల మోసం

Update: 2024-01-29 11:07 GMT

రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్.. కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో టీవీ నటులతో భారీగా ప్రచారం నిర్వహించిన ఓ సంస్థ. హైదరాబాద్ లోని ప్రగతి నగర్ హెడ్ ఆఫీస్ అడ్డాగా సమీనా, ఇస్మాయిల్ అనే ఇద్దరు దంపతులు కలసి ఈ బ్యూటీ పార్లర్ ను నడిపారు. వీరికి తోడు సమీనా చెల్లెలు జెస్సికా కూడా కలసి.. కస్టమర్లను ఆకట్టుకునే విధంగా యూట్యూబ్ లో సీరియల్ హీరోయిన్‌ల(శ్రీవాణి, హిమజ)తో యాడ్స్ చేయించారు. బ్యూటీపార్లర్‌ ఫ్రాంచైజీలు అంటూ జనాలకు ఎర వేసి.. అందినకాడికి దోచుకున్నారు. ఒక్కో బ్యూటీపార్లర్ ఫ్రాంచైజీ కోసం 3 లక్షల 20 వేలు వసూలు చేశారు. ఫ్రాంచైజీ తీసుకుంటే నెలకి 35వేలు రూపాయలు జీతం ఇస్తామని ఆ కిలాడీ దంపతులు నమ్మించారు. యూట్యూబ్‌ చానెళ్లలో యాడ్స్ ఇచ్చి మరీ కస్టమర్లను అట్రాక్ట్ చేశారు. వీరి మాయమాటలు విన్న కొందరు.. మంగళ సూత్రాలు అమ్మి, అప్పు చేసి మరీ.. ఫ్రాంచైజీల కోసం డబ్బులు చెల్లించారు. ఇప్పుడు బాధితులుగా మిగిలారు. వందకు పైగా పార్లర్లు ఓపెన్ చేసి.. 3కోట్లతో ఉండాయించారు. ఫ్రాంచైజీ కోసం డబ్బులు కట్టిన వారికి.. మొదటి మూడు నెలలు జీతాలు చెల్లించిన ఈ కేడీలు.. ఆ తర్వాత చేతులెత్తేశారు. రేపు.. మాపు అంటూ కాలం వెళ్లదీశారు.

చివరకు జీతాల కోసం దంపతులకు కాల్ చేయగా ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన బాధితులు హైదరాబాద్ లోని ప్రగతి నగర్ హెడ్ ఆఫీస్ కు చేరుకున్నారు. అక్కడకు వెళ్లిన కస్టమర్లు షాక్ తిన్నారు. హెడ్ ఆఫీస్ కు తాళం వేసి ఉండటంతో లబోదిబో మన్నారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టామని వాపోయారు. ఆ దంపతులను పట్టుకుని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దంపతులకోసం గాలింపు చేపట్టారు. గతంలో కామారెడ్డి జిల్లాలోను చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసినట్టు ఆరోపణలు వున్నాయని పోలీసులు నిర్ధారించారు. ఇలాంటి వారిని ఎలా నమ్ముతున్నారో అర్థకావడంలేదన్నారు. ఇప్పటి కైనా ప్రజలు ఇలాంటి వారిపట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Tags:    

Similar News