Rameshwaram Cafe : బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. పలువురికి గాయాలు

Update: 2024-03-01 09:44 GMT

కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌(Rameshwaram Cafe)లో పేలుడు చోటుచేసుకుంది. నగరంలోని కుండలహళ్లిలో ఉన్న ఈ కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నాం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులు కేఫ్‌లో పని చేసే సిబ్బందిగా చెప్పుతున్న పోలీసులు.. పేలుడు ఎలా సంభవించిందో కనిపెట్టేందుకు యత్నిస్తున్నట్లు మీడియాకు వివరించారు. ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం ఓ సిలిండ‌ర్ వ‌ల్ల పేలుడు జ‌రిగిన‌ట్లు భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.


పేలుడు(Massive Explosion) జరిగిన ప్రాంతానికి ఫైరింజన్లు చేరుకున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు కేఫ్ నుంచి పేలుడు శబ్దం వినపడిందని స్థానికులు చెబుతున్నారు. పేలుడు జరగ్గానే అక్కడున్న కస్టమర్లంతా భయంతో బయటకు పరుగులు తీసినట్లు చెబుతున్నారు. రామేశ్వరం కేఫ్‌కు ప్రతిరోజు వందల మంది కస్టమర్లు వస్తుంటారు. పేలుడు తర్వాత ఆ కేఫ్ బయట జనాలు పెద్ద ఎత్తున గుమిగూడారు.


Tags:    

Similar News