చంచల్గూడలో కిడ్నాప్ అయిన చిన్నారి సేఫ్

By :  Krishna
Update: 2024-03-03 03:15 GMT

చంచల్గూడలో కిడ్నాప్ అయిన 9నెలల చిన్నారిని పోలీసులు రక్షించారు. శనివారం చంచల్ గూడలోని ఓ ఆస్పత్రిలో పాప అదృశ్యమైంది. తల్లిదండ్రులు వెంటనే మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీలను జల్లెడ పట్టారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా కిడ్నాపర్ కదలికలను గమనించారు. కిడ్నాపర్ ఎంజీబీఎస్లో జహీరాబాద్ బస్ ఎక్కి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు వెంటనే అక్కడి పోలీసులను అలర్ట్ చేయడంతో పాప సురక్షితంగా బయటపడింది. ఛత్తీస్ గఢ్కు చెందిన షహనాజ్ అనే మహిళ ఈ కిడ్నాప్కు పాల్పడిందని పోలీసులు తెలిపారు. అమెపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News