కేసీఆర్ పాపాల వల్లే ఈ కరువు మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్

Byline :  Vamshi
Update: 2024-03-29 07:35 GMT

మాజీ సీఎం కేసీఆర్ చేసిన పాపాల వల్లే ఈ కరువు వచ్చిందని కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి ఆరోపించారు. యాదగిరిగుట్ట పేరు మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పు అని కోమటిరెడ్డి అన్నారు. దేవుడి పేరుతో కాళేశ్వరం కట్టి సర్వనాశనం చేశారని మంత్రి మండిపడ్డారు.

గేట్లు తెరవకముందే కాంగ్రెస్‌లోకి ఇతర పార్టీల నేతలు వస్తున్నారు.’’ అని ఆయన అన్నారు. లోక్ సభ టికెట్ల విషయంలో తాను కలుగజేసుకోనని అన్నారు. పార్టీ అధిష్టానం ఎవరికైతే టికెట్లు కేటాయిస్తుందో వారి గెలుపు కోసం పని చేస్తామని స్పష్టం చేశారు. ఒక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తప్ప.. ఏనాడు తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించలేదంటూ ఎమోషనల్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ప్రశ్నించగా.. కేసీఆర్ ఇన్నాళ్లు చేసిన పాపాలే ఆయనను చుట్టుముట్టాయంటూ కామెంట్ చేశారు.

Tags:    

Similar News