గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన నివాసంలో ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొన్ని రోజుల క్రితమే పార్టీ మారుతున్నట్లు ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయలక్ష్మి తండ్రి కేశవరావు కూడా త్వరలో హస్తం గూటికి చేరనున్నారు.
తాను రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని నిన్న జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి వెల్లడించారు. సీఎం రేవంత్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీల సమక్షంలో తాను కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నానని తెలిపారు. తెలంగాణలో ఇటీవల పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజగా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో హస్తం గూటికి చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ లో చేరబోతున్నారు.