నీటి సమస్యపై సీఎం రేవంత్ రివ్యూ మీటింగ్

Byline :  Vamshi
Update: 2024-03-30 07:21 GMT

తాగునీరు, సాగునీరు సమస్యపై ఫిర్యాదులు అధిక కావడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. వేసవికాలంలో రాష్ట్రంలో కరెంట్ సమస్యలు, తాగునీటి సమస్యలు రాకుండా ఉండటానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ సచివాలయంలో రెండు అంశాలపై సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు విడుదల కావటం, కోడ్‌ అమల్లోకి రావటంతో విద్యుత్‌, తాగునీటిపై అప్రమత్తంగా ఉండాలని ఇది వరకే సీఎం ఉన్నతాధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. వేసవి వేళ విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో పాటు కొన్నినెలలుగా వర్షాల్లేక ప్రాజెక్టుల్లోనూ నీరు డెడ్‌ స్టోరేజీకి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎండాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

Tags:    

Similar News