రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు వెంటనే అన్ని పోస్టులను మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్నికి కోర్టు ఆదేశించింది. ఒకేసారి భారీగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేపట్టడం ఒకటికి మించి ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు మిగతా జాబ్స్‌ను వదిలేయాక పోవడంతో పోస్టులు బ్యాక్‌లాక్‌గా మిగిలి పోతున్నాయి. దీని వల్ల చాల మంది నిరద్యోగులు నష్ట పోతున్నారు. 3 నెలల్లో 33 వేల ఉద్యోగాలు భర్తీ ప్రకియ జరగ్గా 4,590 పోస్టులు మిగిలిపోయినట్లు తెలుస్తోంది.
కానిస్టేబుల్ 2 వేలు, గురుకుల ఉద్యోగాల్లో 1,810 మెడికలం ఆఫీసర్లలో 780 ఉద్యోగాలు మిగిలి పోయాయి. వీటి కోసం మళ్లీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేేయాలి. గురుకులాల్లో డిగ్రీ అధ్యాపకులు, పీజీటీ, లైబ్రేరియన్, జూనియర్ లెక్చరర్లు తదితర పోస్టుల భర్తీ కోసం 2023 ఏప్రిల్ 5న తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఆ నియామకాల్లో ఎగువ, దిగువ భర్తీ చేయాల్సి ఉన్నా అన్నింటికీ ఒకేసారి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఒకేసారి మూడు, నాలుగు పోస్టులకు ఎంపికైన మెరిట్ అభ్యర్థులు ముఖ్యమైన పోస్టులను ఎంచుకోవడంత మిగిలిన పోస్టులు భర్తీ కాకుండా అలాగే మిగిలిపోయాయి. దీంతో అలా మిగిలిపోయిన పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని కొరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.