కాంగ్రెస్ మంత్రులు మాతో టచ్‌లో ఉన్నారు..ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి కామెంట్స్
బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు మరో ఐదుగురు మంత్రులు తమతో టచ్‌లో ఉన్నరని తెలిపారు. తాము గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ఖాళీ అవుతుందని అన్నారు. దమ్ముంటే తమ పార్టీ ఎమ్మెల్యేలను టచ్ చేయాలని సవాల్ విసిరారు. షిండే పాత్ర పోషిస్తానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి చెప్పారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారనే మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను మహేశ్వర రెడ్డి ఖండించారు. కోమటిరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి టచ్‌లో ఉన్నాడో లేడో తెలుసుకోవాలని కోరారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐ చేత ఎందుకు విచారించడం లేదని మహేశ్వర రెడ్డి నిలదీశారు. రంజిత్ రెడ్డి భూములపై ఆరోపణలు చేశారు.. తర్వాత పార్టీలో చేర్చుకుని పక్కన కూర్చొబెట్టుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ ఎందుకు చేయించడం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. టెలిఫోన్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వానిది అయినందున ఆ కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని ఆర్ అంటే రేవంత్, రాహుల్, రాజీవ్ అని టాక్స్ అని అన్నారు. ఇప్పటి వరకు రూ.1500 కోట్లు హైకమాండ్‌కు పంపించారని వివరించారు. మరో రూ.500 కోట్లు పంపించాల్సి ఉందని గుర్తుచేశారు.