ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్ నేతల ఆగ్రహం

Byline :  Vamshi
Update: 2024-03-29 07:14 GMT

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. కడియం విలువల్లేని నాయకుడు అని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. దళిత నేతలు విజయరామారావు, దొమ్మాటి సాంబయ్య, ఎంపీ పసునూరి దయాకర్, అరూరి రమేష్, తాడికొండ రాజయ్యలను ఎదకుండా ఎన్నో కుట్రలు చేశారని వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా చేశారని ఫైరయ్యారు. బీఆర్ఎస్ కోసం నిస్వార్థంగా పని చేస్తానంటే నీచుడని తెలిసినా పార్టీలోకి ఆహ్వానించిమని ఆయన తెలిపారు. కడియం కావ్య పెట్టిన కామెంట్ చూసి నేను ఆశ్చర్యపోయామన్నారు. 31 తారీఖున చేపట్టే కార్యక్రమాల గురించి మాట్లాడేందుకు కడియం శ్రీహరి ఇంటికి 8 గంటలకు నేను స్వయం వెళ్లాను అప్పుడు కూడా ఏలాంటి కామెంట్ చేయలేదన్నారు.

కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై కుట్రలు చేసి పార్టీకి ద్రోహం చేశారు…. కడియం శ్రీహరి నిజాయితీపరుడు అయితే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.కడియం శ్రీహరి ఎంతో మంది బలిపశువులను చేశాడని మండిపడ్డారు. ఎవరికీ అవకాశాలు రాకుండా కుట్రలు చేసి.. ఇప్పుడు తనదారి తాను చూసుకుంటున్నాడని సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్‌లో కడియం‌కు ఏం తక్కువ అయందని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో ఉన్నన్నాళ్లు దళితులను ఎదగనీయకుండా చేసి.. ఇవాళ స్వార్థంతో వేరే పార్టీలోకి వెళ్లడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హస్తం పార్టీలోకి చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నేడు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News