గులాబీ పార్టీలో తాజా పరిణామాలపై కేటీఆర్ సంచలన ట్వీట్

Byline :  Vamshi
Update: 2024-03-29 06:32 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లు తిరుగులేని అధికారాన్ని చెలాయించింది. జాతీయ రాజకీయాల్లోనూ నేషనల్ పాలిటిక్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే గత ఎన్నికల్లో ఓటమితో కారు టైర్లలో గాలి తగ్గింది. మాజీ మంత్రులు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులు గులాబీ పార్టీకి గుడ్‌ బై చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ నేతలను కేసీఆర్ బీఆర్‌ఎస్‌‌లోకి చేర్చుకున్నారు. ఈ నేపధ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. శూన్యం నుంచి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీశాలి కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు.

ఒక్కడుగా బయల్దేరి, లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటిని ఛేదించిన ధీరత్వం కేసీఆర్ దని కితాబునిచ్చారు. అలాంటి ధీరుడు కేసీఆర్ ను కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెపుతారని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో 14 ఏళ్లు ఉద్యమాన్ని నడిపి స్వరాష్ట్రం సాకారం చేసుకున్నామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారని కేటీఆర్ అన్నారు.

Tags:    

Similar News