పవర్ బ్రోకర్లు పార్టీని వీడుతున్నారు.. హారీశ్‌రావు కామెంట్స్
నేతలు పార్టీని వీడటంపై బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హారీశ్‌రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొంత మంది రాజకీయ వాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇదేమీ బీఆర్‌ఎస్‌కు కొత్త కాదని అన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టుమని పది మంది లేకున్నా కేసీఆర్ ఉద్యమాన్ని ప్రారంభించారని చెప్పారు. రానే రాదు అన్న తెలంగాణ సాధించినట్ట ఆయన తెలిపారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అవకాశాలు తీసుకొని ఇప్పుడు వెళ్తున్నారని ధ్వజమెత్తారు.
వాళ్లు కాళ్లు మొక్కినా మళ్లీ పార్టీలోకి రానిచ్చేది లేదని స్పష్టం చేశారు. కష్టకాలంలో ఉన్న పార్టీని వదిలి వెళ్లడమంటే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే అన్నారు. ఇది శిశిర రుతువు... ఆకులు రాలే కాలం... ఇప్పుడు పార్టీని వీడి వెళ్లేవారు కూడా చెత్తకుప్పలో కలిసి పోతారన్నారు. ఆకులు రాలిపోయాక కొత్త చిగురు వచ్చినట్లు... పార్టీ పుంజుకుంటుందని జోస్యం చెప్పారు. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుందన్నారు.