కడియంపై పోటీకి సిద్దం..తాటికొండ రాజయ్య

Byline :  Vamshi
Update: 2024-03-29 10:11 GMT

వరంగల్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. బీఆర్‌ఎస్ పార్టీని వీడుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు మాజీ ఎమ్మెల్యే రాజయ్య ప్రకటించారు. ఈ రోజు ఆయన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఇటీవల అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో రాజయ్య బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఇప్పుడు వస్తే రాజీనామా వెనక్కి తీసుకునేందుకు సిద్దమయ్యారట. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

నిన్న సాయంత్రం బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు కేకే నివాసానికి సీఎం రేవంత్ వెళ్లి పార్టీలో రావాలంటూ ఆహ్వానించారు. అదేవిధంగా ఇవాళ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మినిస్టర్ క్వార్టర్స్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహార ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ మర్యాద పూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారు. ఈ మేరకు ఆయన రేపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లుగా సూచనాప్రాయంగా తెలిపారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యను ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తాజా రాజకీయాలు నేపథ్యంలో తిరిగి రాజయ్య పేరు తెరపైకి వచ్చింది

Tags:    

Similar News