Chhattisgarh:ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
Chhattisgarh:ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) వరుసగా రెండో రోజూ మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. శనివారం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో (Encounter) ఓ మావోయిస్టు చనిపోగా, తాజాగా మరో ముగ్గురు మృతిచెందారు. ఆదివారం ఉదయం కాంకేర్ జిల్లాలోలోని కోయలిబేడా అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వ్ గార్డ్స్ (DRG), బీఎస్‌ఎఫ్ జవాన్లు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.
దీంతో ముగ్గురు మావోయిస్టులు మరణించారని జిల్లా ఎస్పీ ఇందిర కల్యాణ్ చెప్పారు. ఘటనా స్థలంలో ముగురి మృతదేహాలతోపాటు రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని వెల్లడించారు. కాగా, శనివారం సుక్మా జిల్లాలోని బుర్కలంక అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, డీఆర్‌జీ జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాగా గత నెల జనవరి 30 న కూడా.. ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి చెందారు