కుర్రవాళ్లే కాదు యువతులు కూడా చైన్ స్నాచింగ్లు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతి ఓ యువకుడి బైక్పై వెళ్తూ ఛైన్ స్నాచింగ్కు పాల్పడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నల్గొండ జిల్లా దేవరకొండలో ఓ వ్యక్తి.. యువతి స్కూటీ మీద వచ్చి ఓ మహిళ మెడలోని గొలుసును వెనక నుండి లాగే ప్రయత్నం చేశారు. దీంతో మహిళ గట్టిగా కేకలు వేయడంతో చూట్టూ పక్కల ఉన్నవాళ్లు వచ్చి వాళ్లను పట్టుకునే ప్రయత్నం చేశారు. వాళ్లను వెంబడిస్తూ వీడియో తీశారు. కానీ వాళ్ళు మాత్రం స్థానికులకు దొరకకుండా వేగంగా అక్కడి నుండి తప్పించుకున్నారు ఈ ఘటనపై మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వాళ్ళు అంతరాష్ట్ర ముఠానా? లేక స్థానికులా? తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.