కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? అయితే ఇలా చేయండి

Update: 2024-02-06 15:38 GMT

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా చలికాలంలో అయితే పెద్దవారికి కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు వారిని వేధిస్తుంటాయి. అలాంటి వారి కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా ఆ సమస్యలు తగ్గుతాయి. మరి కీళ్లనొప్పులను తరిమికొట్టాలంటే మీరు కొన్ని అలవాట్లు చేసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒత్తిడి వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు రావడానికి ప్రధాన కారణం ఒత్తిడే అని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఒత్తిడి, ఆందోళన వంటి వాటికి దూరంగా ఉండండి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. మెడిటేషన్ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఒత్తిడి తగ్గితే నొప్పులనేవి ఉండవు.

చాలా మంది సరిగా నిద్రపోరు. రాత్రి సమయంలో సరిగా నిద్రపోనటువంటి వారికి కచ్చితంగా కీళ్ల నొప్పులు వస్తాయని వైద్యులు అంటున్నారు. ఆరు లేదా 8 గంటల వరకూ నిద్రపోయేవారికి ఈ నొప్పులు తక్కువగా వస్తాయని చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకూ విశ్రాంతి తీసుకోవడం మంచిది. అలాగే కీళ్ల నొప్పులతో బాధపడేవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది. కీళ్ల నొప్పులు ఉన్నవారు బఠానీలు, బంగాళదుంపలు, టమాటాలు, తేనె ఉండే పదార్థాలు తినకపోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

Tags:    

Similar News