Health Tips : వారికి హెచ్చరిక.. స్ట్రెస్‌ ఎక్కువైతే గుండెపోటు తప్పదు!

Update: 2024-02-11 10:05 GMT

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. తీవ్ర ఒత్తిడి వల్ల శరీరం వారికి తెలియకుండానే బలహీనంగా మారిపోతోంది. ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అధిక ఒత్తిడి వల్ల మనోవికాసాన్ని కోల్పోతున్నారు. మతిమరుపు సమస్య ఎక్కువవుతోంది. స్ట్రెస్ వల్ల నిరాశ ఎక్కువవుతోంది. ఒక్కోసారి ఒత్తిడి అనేది ఎక్కువైతే గుండెపోటు ప్రమాదం తప్పకుండా వస్తోంది. అందులో కొందరి ప్రాణాలు కూడా పోతున్నాయి. ఒత్తిడితో ఉండే వ్యక్తికి రక్తపోటు స్థాయిలు పెరుగుతున్నాయి. దీనివల్ల వారు అనేక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు.

ఒత్తిడి వల్ల మనసు కకావికలం అవుతోంది. దానివల్ల రక్తపోటు సమస్యలు దరిచేరుతున్నాయి. అలాగే కొందరికి మధుమేహం సమస్య కూడా వస్తోంది. ఒత్తిడి అనేది గుండెపోటు సమస్యలను పెంచుతోంది. అమెరికా పరిశోధకులు అభిప్రాయం ప్రకారంగా ఒత్తిడితో చాలా మంది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నట్లు తేలింది. ఈ ఒత్తిడిని తగ్గించడానికి చూయింగ్ గమ్ బాగా పనిచేస్తుంది. చూయింగ్ గమ్ నమలడం వల్ల మానసిక ఒత్తిడి కొద్దికొద్దిగా తగ్గుతోందని పరిశోధకులు తేల్చారు.

ఎక్కువ స్ట్రెస్ అనిపించినవాళ్లు ప్రశాంతమైన ప్రాంతాలకు వెళితే వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇష్టమైన పాటలు వినడం, పర్యాటక ప్రాంతాలను సందర్శించడం వంటివి చేయడం వల్ల ఒత్తిడి సమస్యలు తగ్గుతాయి. అలాగే నిద్ర సమస్యలు ఉన్నవారు ఒత్తిడితో కచ్చితంగా ఇబ్బంది పడుతుంటారు. కచ్చితంగా 8 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాలి. దీనివల్ల ఒత్తిడి సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. అలాగే వ్యాయామం చేయడం వల్ల కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. శ్వాసతో కూడిన వ్యాయామాలు చేయడం వల్ల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల ఒత్తిడి దూరం అవుతుంది. వ్యాయామం చేసి ఒత్తిడిని తగ్గించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News