Tablet for Cancer : క్యాన్సర్కు మందు కనిపెట్టిన టాటా ఇనిస్టిట్యూషన్

Byline :  Bharath
Update: 2024-02-28 09:39 GMT

క్యాన్సర్ వ్యాధి మానవాళికి అతిపెద్ద ముప్పుగా మారింది. దీనికి సరైన చికిత్స లేకపోవడంతో ఏటా కొన్ని కోట్ల మంది చనిపోతున్నారు. క్యాన్సర్ మందును కటిపెట్టేందుకు ఇప్పటివరకు ఎన్నో పరిశోధనలు జరిగాయి. కానీ, ఏది కూడా పూర్తిగా వ్యాధిని నయం చేయలేకపోయింది. ఈ క్రమంలో టాటా మెమోరియల్‌ సెంటర్‌ ఫర్‌ క్యాన్సర్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రీట్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ క్యాన్సర్ కు మందు కనిపెట్టింది. క్యాన్సర్ ను క్యూర్ చేయడానికి రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, సర్జరీ లాంటి చాలా ఉన్నాయి. కానీ ఆ మహమ్మారి తిరగబడటంతో మరణాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. అయితే దీన్ని అరికట్టేందుకు టాటా మెమోరియల్‌ సెంటర్‌ ఫర్‌ క్యాన్సర్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రీట్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ కనిపెట్టిన ట్యాబ్లెట్ పనిచేస్తుంది. ఇది క్యాన్సర్ చికిత్సలో గొప్ప మైలు రాయని, దీనివల్ల క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉండదని సైంటిస్టులు చెప్తున్నారు.

టాటా పరిశోధకులు కనుగొన్న ఈ ట్యాబ్లెట్ రక్తంలోకి చేరగానే.. క్రొమాటిన్ కణాలను పూర్తిగా నాశనం చేస్తుంది. దాంతో క్యాన్సర్ కణాలు తిరగబడకుండా ఈ ట్యాబ్లెట్ అడ్డుకుంటుంది. దీంతో పాటు క్యాన్సర్ ట్రీట్మెంట్ లో తీసుకునే కీమోథెరపీ, రేడియేషన్ థెరపీల్లో ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయని తెలిపారు. కాగా ఈ డ్రగ్ ఆమోదం కోసం ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)కి దరఖాస్తు పెట్టుకున్నారు. దీనికి అనుమతి లభిస్తే.. జూన్ - జులై నాటికి మార్కెట్ లో అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం కార్పొరేట్ హాస్పిటల్స్ లో క్యాన్సర్ ట్రీట్మెంట్ కు లక్షల్లో ఖర్చవుతుండగా.. ఈ ట్యాబ్లెట్ ను కేవలం రూ.100కే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ డ్రగ్ అభివృద్ధి చేసేందుకు దాదాపు పదేళ్ల పాటు కష్టపడ్డారు.

Tags:    

Similar News