Candida auris fungus : అమెరికాను వణికిస్తున్న భయంకరమైన ఫంగస్

Update: 2024-02-04 15:54 GMT

అగ్ర రాజ్యం అమెరికాలో క్యాండిడా ఆరిస్ అనే ప్రాణాంతక ఫంగస్ వ్యాప్తి చెందుతోంది. ఈ నెలలో వాషింగ్టన్‌లో కనీసం నలుగురికి ఈ ఫంగస్ సోకినట్లు గుర్తించారు. ఈ పంగస్ వల్ల మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చారించారు. జనవరి 10వ తేదీన తొలి కేసు నమోదైంది. ఆ తరవాత మరో ముగ్గురికి ఇది సోకినట్టు అక్కడి ప్రజారోగ్య శాఖ అధికారులు తెలిపారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లపై ఈ ఫంగస్ చాలా సులభంగా దాడి చేస్తుందని స్పష్టం చేశారు. అంతే కాదు. యాంటీ ఫంగల్ డ్రగ్స్‌కి కూడా ఇది లొంగడం లేదని వివరిస్తున్నారు.ఇప్పటికే తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న వాళ్లని ఈ ఫంగస్‌ సోకితేప్రాణాంతకమవుతుందని వైద్యులు చెబుతున్నారు. శ్వాసకోశ సమస్యలున్న వాళ్లకూ ప్రమాదమే. ఈ ఇన్ఫెక్షన్ ఆసుపత్రులలో సులభంగా వ్యాపిస్తుంది . చాలాసార్లు ప్రజలకు దాని గురించి తెలియదు. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న తర్వాత, రోగి వెంటనే లక్షణాలను చూపించడు.

అతను వెంటనే తీవ్రమైన అనారోగ్యానికి గురికాడు. ఇతర వ్యక్తులకు కూడా సంక్రమణ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ మొదటి కేసు జనవరిలో వెలుగులోకి వచ్చింది. దీని తరువాత సీటెల్, కింగ్ కౌంటీలో మరో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ ఇన్ఫెక్షన్ రోగి రోగనిరోధక శక్తిని నాశనం చేస్తుంది. అనేక యాంటీ ఫంగల్ మందులు దానిపై పనిచేయవు. ఇతర వ్యాధులు రోగిపై దాడి చేస్తాయి. చాలా సార్లు రోగి ప్రాణాలు కోల్పోతాడు. ఈ ఫంగస్ సోకిందని గుర్తిస్తే వెంటనే ఆ వ్యక్తిని ప్రత్యేక గదిలో ఉంచాలి. డిస్‌ఇన్‌ఫెక్టెంట్స్‌తో గదిని శుభ్రం చేయాలి. వాళ్లకు నీళ్లు, ఆహారం అందించే వాళ్లు కచ్చితంగా గ్లోవ్స్ తొడుక్కోవాలి. ఆల్కాహాల్‌ ఉన్న శానిటైజర్‌నే వినియోగించాలి. ప్రస్తుతానికి ఈ కేసులు నమోదవుతున్న చోట అధికారులు అప్రమత్తమయ్యారు. వీలైనంత వరకూ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. శానిటైజర్‌లు వినియోగించాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

Tags:    

Similar News