ఇడ్లీ, వడతో జీవ వైవిధ్యానికి ముప్పు.. మరో 26 భారతీయ వంటకాలు కూడా

Byline :  Bharath
Update: 2024-02-24 09:45 GMT

తాజా అధ్యయనం తెలిపిన దాని ప్రకారం.. భారతీయులు తినే పలు ఆహార పదార్థాలు జీవ వైవిధ్యానికి ముప్పు కలుగుతుందని తేలింది. ప్రపంచ వ్యాప్తంగా 151 వంటకాలపై జరిపిన పరిశోధనల్లో జరపగా.. అందులో 26 భారతీయ వంటకాలే ఉండటం గమనార్హం. ఆ లిస్ట్ లో ఇడ్లీ, వడ, చనా మసాలా, రాజ్మా, చపాతి సహా పలు ఆహార పదార్థాలున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ సైంటిస్టులు చేసిన అధ్యయనంలో పర్యావరణంపై ఆహార పదార్థాల ప్రభావం వెలుగు చూసిందట. దీనివల్ల ఆహార ఉత్పత్తి జరిగే ప్రాంతాల్లో రకరకాల జీవజాతులు ప్రభావితం అవుతాయని వారు చెప్తున్నారు. వ్యవసాయం చేస్తే ప్రదేశాల్లో క్షీరదాలు, ఉభయ చరాలు, పక్షులపై పడే ప్రభావంపై కూడా సైంటిస్టులు అంచనా వేశారు.

ఈ లెక్కన బియ్యం, పప్పు ధాన్యాలతో కూడిన పదార్థాల వల్ల జీవ వైవిధ్యానికి ఎక్కువ ముప్పు ఉంటుందని సైంటిస్టులు తేల్చారు. భారతదేశంలో బియ్యం, పప్పు పంటల సాగుకు తరచూ భూ మార్పిడి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల అనేక జీవజాతులు ఆవాసాలను కోల్పోతున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. 

Tags:    

Similar News