హైదరాబాద్ పోలీసు విభాగంలో భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి. 163 మంది ఇన్స్పెక్టర్లను స్థాన చలనం కలిగింది. విధివిధానాల ప్రకారం, అవసరాలను దృష్టిలో ఉంచుకుని బదిలీ చేసినట్లు తెలుస్తోంది. బదిలీ ఉత్తర్వులను కమిషనర్ సీవీ ఆనంద్ జారీ చేశారు. ట్రాన్స్ఫర్ అయిన వారిలో అమ్జంద్ అలీఖాన్(స్పెషల్ బ్రాంచి), ఎన్. రవి(గాంధీనగర్), మహ్మద్ షకీర్ అలీ(బండ్లగూడ), రవికుమార్ అన్నప(మంగళ్ హాట్), శివచంద్ర(సంతోష్ నగర్), షేక్ ఖాదర్ హుసేస్(చార్మినార్), శ్రీనాథ్ రెడ్డి(టాస్క్ ఫోర్స్ ఈస్ట్), అజయ్ కుమార్ (టాస్క్ ఫోర్స్ సౌత్), కె. చంద్రశేఖర్(చార్మినార్ పీఎస్) తదితరులు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో కొన్నాళ్లుగా పోలీసుల విభాగంలో బదిలీలు సాగుతున్నాయి.