పల్లెబాట పట్టిన భాగ్యనగరం.. ఖాళీగా హైదరాబాద్ రోడ్లు

Byline :  saichand
Update: 2024-01-15 09:26 GMT

భాగ్యనగరం రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి నిత్యం వాహనాల రద్దీతో హడావుడిగా కనిపించే భాగ్యనగరం రోడ్లు సంక్రాంతి సందర్భంగా పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయాయి. పండుగ సందర్భంగా జనాలు సొంతూళ్లకు తరలిపోవడంతో గజి బిజీగా ఉండే నగర రోడ్లు కాస్త ప్రశాంతంగా మారిపోయాయి. సాధారణ రోజుల్లో గమ్యానికి చేరుకోవాలంటే గంటకు పైగా పట్టే సమయం అర గంటలోనే అయిపోతుంది. నిత్యం రద్దీగా ఉండే ఐటీ కారిడార్,జూబ్లీహిల్స్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, అమీర్ పేట్ ప్రధాన జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్ భారీగా తగ్గింది.

సంకాంత్రి సందర్భంగా ముందుగానే పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో జనవరి 12నే ప్రజలు సొంతూళ్ల పయనమయ్యారు. దీంతో బస్టాండ్లు,రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి.. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్ఆర్టీసీ 6,261 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రతి ఇంటి ముంగిళ్ళు సస్తవర్ణశోభితమైన రంగవల్లులతో కళకళలాడుతున్నాయి.

Tags:    

Similar News