Gold Rate : బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. భారీగా పడిపోయిన ధరలు!

Update: 2024-02-15 02:27 GMT

(Gold - silver Rates) బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్. ప్రస్తుతం శుభకార్యాల సీజన్ నడుస్తోంది. వివాహాది కార్యక్రమాలే కాకుండా ఈ నెలంతా అనేక శుభకార్యాలు జరగనున్నాయి. ఇదే సమయంలో బంగారం ధర కూడా తగ్గింది. దీంతో బంగారం కొనాలనకునేవారికి ఇదొక మంచి సమయం అని చెప్పాలి. గత కొద్ది రోజులుగూ బంగారం ధరలు పడుతూ వస్తున్నాయి. తాజాగా నేడు భారీగా రేట్లు దిగావచ్చాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. అమెరికాలో రూపాయి విలువ కాస్త మెరుగైందని చెప్పాలి. ప్రస్తుతం డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ రూ.83.025 వద్ద కొనసాగుతోంది. అక్కడ స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1990 డాలర్ల వద్ద ఉంది. సిల్వర్ రేటు కూడా ఔన్సుకు 22.38 డాలర్లు పలుకుతోంది. ఇకపోతే దేశంలో బంగారం, వెండి ధరలు బాగా తగ్గాయి.

హైదరాబాద్ మార్కెట్లో గత పది రోజుల్లో దాదాపు రూ.1000 వరకూ బంగారం ధర దిగి వచ్చింది. నేడు ఒక్కరోజే 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 తగ్గింది. దీంతో తులం బంగారం విలువ రూ.57 వేల మార్క్ వద్ద కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.660లు తగ్గింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాములు రూ.62,180లు పలుకుతోంది. ఇకపోతే వెండి రేట్లు కూడా తగ్గాయి. ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లో ఒక్కరోజే సిల్వర్ రేటు రూ.1500 తగ్గింది. దీంతో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.75,500 పలుకుతోంది.

Tags:    

Similar News