బెంగుళూరు కేఫ్‌లో పేలుళ్లు.. హైదరాబాద్‌లో హైఅలర్ట్‌

బెంగుళూరు కేఫ్‌లో పేలుళ్లు.. హైదరాబాద్‌లో హై అలర్ట్‌;

By :  Kiran
Update: 2024-03-01 14:46 GMT


బెంగళూరు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం హైఅలెర్ట్‌ ప్రకటించారు. స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులను అప్రమత్తం చేశామని.. కీలక ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. జూబ్లీ బస్‌స్టాండ్‌, ఎంజీబీఎస్‌, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బెంగళూరు కేఫ్‌ పేలుడు కారణాల గురించి ఆరా తీస్తున్నామని చెప్పారు సీపీ.

ఇదిలా ఉంటే.. శుక్రవారం మధ్యాహ్నాం బెంగళూరులోని కుండలహళ్లిలోని ఫేమస్‌ రామేశ్వరం కేఫ్‌ వద్ద టిఫిన్‌ బాక్స్‌ బాంబ్‌తో ఆగంతకులు బ్లాస్ట్‌ జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. ఓ వ్యక్తి కేఫ్‌లో బ్యాగు పెట్టి వెళ్లిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయ‌ని తెలిపారు. ఆ బ్యాగులో ఉన్న ఐఈడీ కార‌ణంగానే పేలుళ్లు జ‌రిగాయ‌ని పేర్కొన్నారు. ఐఈడీతో దాడి జరిపారని.. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన ప్రకటించారు. అయితే మొద‌ట గ్యాస్ సిలిండ‌ర్ పేలింద‌ని అంద‌రూ భావించారు. కానీ ఓ గుర్తు తెలియ‌ని వ్యక్తి కేఫ్‌లో ఉంచి వెళ్లిన బ్యాగులో పేలుడు సంభ‌వించిన‌ట్లు క‌ర్ణాట‌క ప్రభుత్వం నిర్ధారించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.తాజాగా దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక్కసారిగా బాంబు పేలినట్లుగా కనిపిస్తోంది


Tags:    

Similar News