Durgam cheruvu : డ్రైవర్ నిర్లక్ష్యం.. కేబుల్ బ్రిడ్జిపై ఆటో బోల్తా
By : Mic Tv Desk
Update: 2023-08-24 08:50 GMT
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై పెను ప్రమాదం తప్పింది. ఓ ఆటో బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ సహా మరొకరికి గాయాలయ్యాయి. జూబ్లీహిల్స్ నుంచి ఐటీసీ కోహినూర్ వైపు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. సెల్ ఫోన్ చూస్తూ ఆటో నడుపుతున్న డ్రైవర్ ముందర ఉన్న బైక్ ను ఢీకొట్టబోయాడు. భయంతో ఆటోను కుడివైపునకు తిప్పాడు. దీంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్తో పాటు అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఆ సమయంలో ఆటో వెనుక వచ్చిన కారు డ్రైవర్ చాకచక్యంగా పక్కకు తిప్పడంతో ప్రమాదం తప్పింది. ఈ నెల 22న ఈ ప్రమాదం జరగగా తాజాగా వీడియోలు వెలుగులోకి వచ్చాయి.