independence day 2023 : 12 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన బాలయోధుడి కథ

Update: 2023-08-12 12:09 GMT

పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమయ్యాం. దేశం బానిస సంకెళ్లను తెంచుకుని స్వేచ్ఛా విహంగంలా ఎగిరిన అపూర్వ క్షణాలను గుర్తు చేసుకునే రోజు. ఎందరెందరి త్యాగఫలమో ఈ సుదినం. భరతమాతను తెల్లదొరల చెర నుంచి విడిపించడానికి వేలమంది త్యాగాలు చేశారు. విలువైన ప్రాణాలను ధారపోశారు. స్వాతంత్ర్య వీరులు అనగానే గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి వారు చప్పున గుర్తుకొస్తారు. అయితే అలాంటి ప్రముఖులతోపాటు దేశమంతటా సామాన్యులెందరో స్వాతంత్ర్యం కోసం పోరాడారు. పెద్దలే కాదు, తెల్లదొరల, వారి తొత్తులైన నల్లదొరల ధాష్టీకాలను సహించలేని బాలలు కూడా వందేమాతరం అంటూ జెండా పట్టి జైళ్ల కెళ్లారు. తెల్లోడి తూటాలకు నేలకొరిగారు. వారిలో చాలామందికి చరిత్రపుటల్లో చోటుదక్కలేదు.




 


స్వాతంత్ర్యం కోసం కొట్లాడి 12 ఏళ్లకే బ్రిటిష్ వారి కాల్పుల్లో నేలకొరిగాడు ఓ బాలుడు. పేరు బాజీ రౌత్. భారత స్వాతంత్ర్య అమర వీరుల్లో అతి పిన్నవయస్కుడైన బాజీ 1926 అక్టోబర్ 5న ఒడిశాలోని డెంకనాల్ జిల్లాలో జన్మించాడు. తండ్రి పడవ నడిపేవాడు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని శంకర్ ప్రతాప్ సింగ్ దేవ్ అనే రాజు ఏలేవాడు. పన్నుపోట్లతో ప్రజలను వేధించేవాడు. బాలీ తల్లిని ఆ బాధితుల్లో ఒకరు. బైష్ణవ్ చవాన్ పట్నాయక్ అనే యోధుడు, మార్క్సిస్టు ఆ ప్రాంతంలో రాజుపై తిరుగుబాటు లేవదీశాడు. ప్రజామండల్ పేరుతో ఉద్యమాన్ని నిర్మించాడు. బాలలను కూడా చేర్చుకున్నాడు. రాజు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచేయడానికి యత్నించాడు. బ్రిటిష్ వారి సాయం తీసుకున్నాడు. తెల్లసైనికులు డెంకనాల్‌లో నరమేధం సృష్టించారు. పట్నాయక్ తప్పించుకున్నాడు. అతన్ని వేటాడ్డానికి రాజు సైనికులు, తెల్ల సైనికులు పల్లెల్లో బీభత్సం సృష్టించారు. బ్రహ్మణి నది వద్ద పట్నాయక్ ఉన్నాడని అక్కడి వెళ్లారు.




 


Tags:    

Similar News