independence day 2023 : జాతీయ జెండా ఎగరేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Update: 2023-08-12 13:26 GMT

మువ్వన్నెల జెండా పండగ వచ్చేస్తోంది. భిన్నజాతులకు, మతాలకు నిలయమైన మన భారతావని 77వ స్వాతంత్ర్య వేడుకలను ఎప్పట్లాగే ఘనంగా జరుపుకోనుంది. జెండాలు, శుభాకాంక్షల సందడి అప్పుడే మొదలైంది. కేంద్రం ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలని రూ. 25కే పోస్టాఫీసుల్లో జెండాలను అందుబాటులో ఉంచింది. పిల్లల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. కాయితాల జెండాలు, వస్త్రంలో తయారు చేసిన జెండాలు చేసుకుంటున్నారు. కొందరు షాపుల్లోకి వెళ్లి కొనుక్కుంటున్నారు. పంద్రాగస్టు వేడుక కోసం స్టిక్కర్లు, స్పెషల్ యాక్సెసరీస్ మరెన్నో అందుబాటులో వస్తున్నాయి. అయితే దేశగౌరవ ప్రతిష్టలకు చిహ్నమైన జాతీయ పతాకాన్ని ఎగరవేసేటప్పుడు, మరో విధంగా వేడుక చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తులు తీసుకోవాలి. లేకపోతే జరిమానా, జైలుశిక్ష వంటి చిక్కుల్లో పడొచ్చు.

1. జాతీయ పతకాన్ని నూలు, ఖాదీ, సిల్కుతోనే తయారు చేయాలి. ప్లాస్టిక్‌తో చేయకూడదు. జెండా పొడవు, వెడల్పుల నిష్పత్తి 2:3 ఉండాలి. కాగితంతో చిన్నచిన్న జెండాలు చేసుకోవచ్చు.

2. పతాకంలో పై నుంచి కిందికి వరుసగా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ ఉండేలా నిటారుగా ఎగరేయాలి. జెండా కిందకు వంచకూడదు. మువ్వన్నెల పతకాన్ని వేరే జుండాలతో కలసి ఎగరేస్తే వాటికంటే ఎత్తులో ఉంచాలి. సగం కిందికి దించి ఎగరేయకూడదు. కర్ర చివరనే కట్టి ఎగరేయాలి.

3. జెండాలో తెల్లరంగు మధ్యలోని అశోక చక్రంలో 24 ఆకులు కచ్చితంగా నీలం రంగులోనే ఉండాలి.

4. జాతి పతాకను సూర్యోదయం తర్వత మాత్రమే ఎగరేయాలి. సూర్యుడు అస్తమించకముందే దించాలి.

5. జాతీయ జెండా రంగుల్లోని దుస్తులను ధరించడంపై నిషేధం లేదు. అయితే నడుము కింది భాగంలో అసలు ధరించకూడదు.

6. కర్చీఫ్, దిండ్లు, లోదుస్తుల రూపంలో అసలు వాడకూడదు.

7. చెవిదుద్దులు, చీర, టీషర్లు, గాజులు, హారాలు వంటి వాటిలో మూడు రంగులు వాడొచ్చు.

8. జాతీయ జెండాను ఉద్దేశ‌పూర్వ‌కంగా నేల‌పై లేదా నీటిలో వేయొద్దు, కాలి బాట‌లో పడెయ్యకూడదు.

9. దెబ్బతిన్న, చిరిగిపోయిన జెండాలను ఎగరేయకూడదు.

10. పతాకాన్ని హాళ్ళలోగానీ, గదుల్లో జరిపే సమావేశాల్లో వేదికలపై ప్రదర్శించేటప్పుడు కుడివైపునే (చూసేవారికి ఎడమవైపున) ప్రదర్శించాలి.


Tags:    

Similar News