independence day 2023 : ఇంటిపై జెండా ఎగరేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Update: 2023-08-14 12:36 GMT

77వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంతో దేశ ప్రజలంతా తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరేయాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఆగస్టు 13 నుంచి 15 వరకు జెండాలు ఎగరేయాలని ప్రధాని కోరారు. ఈ మేరకు రాష్ట్రాల్లో జాతీయ జెండా పంపిణీ కూడా జరుగుతోంది. దేశ ప్రజలకు త్రివర్ణ పతాకంతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో దేశ ప్రజలు ఏదో ఫార్మాల్టీకి జాతీయ జెండాను ఎగరేశామన్నట్లు కాకుండా.. భక్తితో ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని సూచించారు.




 


ఈ క్రమంలో ప్రజలు జాతీయ జెండాను ఎగురవేసే సమయంలో ప్రతీ ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి. జెండాను విలోమ పద్ధతిలో ఎగరేయకూడదు. చినిగిపోయిన జెండాను ప్రదర్శించవద్దు. జెండాతో వస్తువు, భవనాల్లాంటి వాటిని కవర్ చేయకూడదు. నడిచే దారిలో, నేలపై, నీటిలో పడేయరాదు. ఏ ఇతర జెండా.. జాతీయ జెండా కంటే ఎత్తులో ఉండకూడదు. జెండా చిరిగినా, పాడైనా, నలిగినా, తిరగబడినా వాడేందుకు వీలు లేదు. రాతలు, డెకరేషన్ ఉన్న జెండా అనుమతించరు.




Tags:    

Similar News