independence day 2023 : భారతీయుల భారీ రికార్డ్..10 కోట్ల జెండాలతో..

Update: 2023-08-16 10:14 GMT

77 భారత స్వాంత్రత్ర్య దినోత్స వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి. పాఠశాలలు మొదలు ప్రధాన మైదానాల వరకు ప్రజలతో పాటు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలను అంగరంగవైభంగా నిర్వహించారు. ప్రతి ఇళ్లు మువ్వన్నెల జెండా రెపరెపలతో దేశభక్తి ఉప్పొంగింది. ఈ క్రమంలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారతాయులు భారీ రికార్డును నెలకొల్పారు. ఆగస్టు 15 రోజున దేశవ్యాప్తంగా 10 కోట్ల జెండాలతో పది కోట్ల మంది సెల్పీలు దిగి అరుదైన ఘనతను సాధించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు, హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాతో సెల్ఫీ దిగి ఆ పిక్‎ను సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. దేశభక్తి ఇదే అంటూ నలుదిక్కులకు చాటి చెప్పారు భారతీయులు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు.




 


హర్ ఘర్ తిరంగ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం, జాతీయ జెండాతో 10 కోట్ల 8 లక్షల 92 వేల 971 మంది సెల్ఫీలు దిగి అప్‌లోడ్ చేశారు.

ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆగస్టు 13 నంచి 15 వరకు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరు తమ ఇంటిపైన జెండాను ఎగురవేయాలని స్థానిక నేతలు ప్రజలను కోరారు. జెండా ఎగురవేయడంతో పాటు దానితో ఓ సెల్పీ దిగి

హర్ ఘర్ తిరంగా వెబ్‌సైట్ హోమ్ పేజీలో అప్‎లోడ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లడంతో

ఈ పోర్టల్‏లో పలువురు తమ సెల్ఫీలను అప్‎లోడ్ చేశారు. దీంతో ఒక్కరోజే పది కోట్ల సెల్ఫీలు వెబ్‎సైట్‎లో అప్‎లోడ్ అయ్యాయి.




 


75వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ను కేంద్ర సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడు 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్ ను విజయవంతం చేసేందుకు ప్రధాని మోదీ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. మోదీ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.  independence day ౨౦౨౩ 




 


Tags:    

Similar News