independence day 2023 : పీఎం నుంచి సీఎం వరకు.. బ్లూటిక్స్ మాయం.. ఎందుకంటే..?

Update: 2023-08-14 11:28 GMT

77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, హర్ ఘర్ తిరంగ అభియాన్ లో భాగంగా దేశ పౌరులంతా.. తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో డీపీలు మార్చి జాతీయ జెండాను ఉంచుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మోదీ ఈ ప్రకటన చేసిన మరుక్షణం నుంచి భారత ప్రజలు సోషల్ మీడియాలో జాతీయ జెండా ఫొటోలను తమ డీపీలుగా పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ సమస్యొచ్చి పడింది. ట్విట్టర్ వెరిఫికేషన్ టిక్ కలిగిన రాజకీయ నేతలు తమ డీపీలు మార్చుకున్నారు. అందులో పీఎం నుంచి సీఎంలు కూడా ఉన్నారు. కాగా, వారి వెరిఫికేషన్ టిక్స్ కూడా ఎగిరిపోయాయి.




 


వెరిఫికేషన్ కోల్పోయినవాళ్లలో ప్రధాని మోదీ, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, గోవా సీఎం డాక్టర్ ప్రమోద్ సావంత్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. అయితే, ప్రధాని అకౌట్ వెరిఫికేషన్ టిక్ కొంత సమయానికి పునరుద్దరించబడినా.. సీఎంల అకౌంట్స్ మాత్రం అలానే ఉన్నాయి. ఈ కారణంగా అసలేం జరుగుతుందో అర్థం కాక యూజర్లలో గందరగోళం నెలకొంది. అప్పటివరకు ఉన్న టిక్.. డీపీ మార్చగానే ఎందుకు పోయిందా అని చర్చలు మొదలయ్యాయి. మోదీ వల్లే ఇదంతా జరిగిందని కొందరు అంటున్నారు.

independence day 2023independence day 2023independence day 2023ఈ క్రమంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ట్విట్టర్ కొత్తగా ప్రవేశపెట్టిన మార్గదర్శకాల ప్రకారం.. వెరిఫికేషన్ టిక్ కలిగిన ఏ అకౌంట్ అయినా.. తమ ఖాతా ప్రొఫైల్ ఫొటో మార్చిన వెంటనే ఆ అకౌంట్ వెరిఫికేషన్ టిక్ ఎగిరిపోతుంది. ఆ తర్వాత ట్విట్టర్ మేనేజ్మెంట్ తో రివ్యూ, ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత తిరిగి వెరిఫికేషన్ టిక్ ను పునరుద్దరిస్తారు. అంతకుముందు నిబంధనలు పాటించని 24 లక్షల మంది అకౌంట్లను ట్విట్టర్ బ్లాక్ చేసింది. 




Tags:    

Similar News