independence day 2023 : 2047 కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఉండాలి- ద్రౌపది ముర్ము

Update: 2023-08-14 15:23 GMT

ఆగస్టు 15..స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశం ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం భారతదేశానిదే ప్రశంసించారు. మువ్వనన్నెల జెండా చూస్తే ప్రతీ భారతీయుడి హృదయం ఉప్పొంగుతుందని అన్నారు. 2047 కల్లా ఇండియా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. జీడీపీ ప్రతీ ఏటా పెరుగుతోందని చెప్పారు. దీని కోసం గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు చాలా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అలాగే ఆదివాసీల ప్రయోజనాల కోసం కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జీ-20కి సంబంధించిన అన్ని కార్యక్రమాల పట్ల భారత పౌరులు ఉత్సాహంగా ఉన్నారని రాష్ట్రపతి వివరించారు. ఈ ఉత్సాహం, సాధికారిక భావనతో పాటూ అన్ని రంగాలలో ప్రగతిని సాధిస్తున్నామన్నారు.




 


భారతదేశ రైతులు దేశ ఆర్ధిక అభివృద్ధికి గణనీయంగా తోడ్పడుతున్నారని...వారికి దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందని ద్రౌపది ముర్ము అన్నారు. అలాగే చంద్రయాన్-3 జాబిల్లి మీద అడుగుపెట్టే ఘడియ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం కూడా అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 


Tags:    

Similar News