ఒకేచోట 150 కార్లు గుద్దుకుని ఏడుగురి బలి

By :  Kiran
Update: 2023-10-24 10:48 GMT

దట్టమైన పొగమంచు ఆవరించినా ఏమాత్రం పట్టించుకోకుండా రివ్వున దూసుకెళ్లిన కార్లు ఘోర విషాన్ని మిగిల్చాయి. ఓకే చోట 158 కార్లు, ఇతర వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా, 30 మందికిపైగా గాయపడ్డారు. అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది. పదుల సంఖ్యలో వాహనాలు మంటల్లో చిక్కుకుని గుర్తుపట్టని విధంగా కాలిపోయాయి. ప్రమాదం కారణంగా 11 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వాహనాల మధ్య ఇరుక్కుపోయిన ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.

55వ నంబర్ అంతర్రాష్ట్ర రహదారిపై న్యూ ఓర్లానో సమీపంలోని పాంట్‌ చార్ట్రెయిన్‌ దగ్గర కార్లు, భారీ వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొట్టి గుట్టలు గుట్టలుగా పడిపోయాయి. ఏం జరుగుతోందో తెలుసుకుని తేరుకునేలోపే వాహనాలు వేగంగా వచ్చిపడ్డాయి. అరగంటపాటు ఢీకొట్టుకున్నాయని ప్రత్యక్ష సాక్షలు చెప్పారు. వేగంగా వచ్చిన ఓ కారు కొన్ని కార్లను ఢీకొట్టి అంతే వేగంగా బ్రిడ్జిపై నుంచి నీటి పడిపోయింది. మరిన్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, స్కూళ్లకు సెలవులు ఇచ్చామని అధికారులు తెలిపారు.



Tags:    

Similar News