మెక్సికోలో ఘోరం.. మృతుల్లో ఆరుగురు భారతీయులు

Update: 2023-08-04 04:04 GMT

మెక్సికోలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు భారతీయులు అక్కడికక్కడే చనిపోగా పలువురు గాయపడ్డారు(Mexico Bus with Indians). నాయారిత్ రాష్ట్ర రాజధాని తెపిక్‌ సమీపంలో ఓ విదేశీ ప్రయాణికుల బస్సు అదుపు తప్పి 50 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది. ముగ్గురు చిన్నారులు సహా 17 మంది మృతిచెందారు. 40 మంది ప్రయాణికులతో గురువారం టిజువానా వెళ్తున్న బస్సు బ్లాంకా దగ్గర ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయింది. విషయం తెలుసుకన్న పోలీసులు వెంటనే సంఘటన స్థలం చేరుకుని క్షతగాత్రులను కాపాడారు. మృతుల్లోనూ, క్షతగాత్రుల్లోనూ భారతీయులు ఉన్నారని అధికారులు చెప్పారు. వారి వివరాలేమిటో తెలియడం లేదు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరగొచ్చని తెలుస్తోంది. బస్సులో ఇండియా(India)తోపాటు, డొమినికన్ రిపబ్లిక్(Dominical Republic) సహా పలు ఆఫ్రికా దేశాల పౌరులు ఉన్నారని అధికారులు చెప్పారు. బస్సు అమెరికా సరిహద్దుకు(US boarder) వెళ్తోందని, అందులో అక్రమ వలసదారులు ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి.  


Tags:    

Similar News