220 childrens : న్యుమోనియాతో 220 మంది చిన్నారులు మృతి

Update: 2024-01-27 16:19 GMT

న్యుమోనియాతో 220 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది. మూడు వారాల్లోనే న్యుమోనియా కారణంగా 200 మందికి పైగా చిన్నారులు మరణించడం కలకలం రేపింది. పంజాబ్ ప్రావిన్సులో ఈ దారుణ ఘటన జరిగింది. అతిశీతల వాతావరణం వల్ల ఈ మరణాలు సంభవించాయని ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది పిల్లలు పోషకాహార లోపం వల్లే మరణించారని అధికారులు స్పష్టం చేశారు.

మరణించిన వారిలో న్యుమోనియా వ్యాక్సిన్ తీసుకోని పిల్లలు కూడా ఉన్నారని పంబాబ్ ప్రావిన్సు అధికారులు వెల్లడించారు. జనవరి 1వ తేది నుంచి ఇప్పటి వరకూ కూడా 10 వేలకు పైగానే న్యుమోనియా కేసులు నమోదైనట్లుగా అక్కడి వైద్యాధికారులు తెలిపారు. ఆ పది వేల మంది చిన్నారుల్లో 220 మంది న్యుమోనియాతో చనిపోయారని, చనిపోయినవారంతా ఐదేళ్లలోపు పసిపిల్లలే అని అధికారులు ప్రకటించారు.

పాకిస్తాన్‌లోని లాహోర్ ప్రాంతంలో 47 మంది పిల్లలు న్యుమోనియాతో చనిపోయారు. పంజాబ్ ప్రావిన్సులో గత ఏడాది కూడా 990 మంది న్యుమోనియాతో మరణించినట్లుగా అక్కడి ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. పిల్లల వరుస మరణాలు సంభవించడంతో వారి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. తమ పిల్లల్ని కాపాడాలని అక్కడి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అధికారులు చర్యలు తీసుకుని తమ పిల్లల్ని రక్షించాలని కోరుతున్నారు.




 


Tags:    

Similar News