తెల్లారుజామున ఘోరం.. 63 మంది సజీవదహనం..
నిద్రలో ఉన్నవారు నిద్రలోనే ఆహుతయ్యారు. తెలవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 63 మంది సజీవదహనం కాగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో గురవారం ఈ ప్రమాదం జరిగింది. నగరం నడిబొడ్డులోని ఓ భవనంలో పలు అపార్లమెంట్లు మంటల్లో చిక్కకున్నాయి. ఇప్పటికి వరకు 63 మృతదేహాలను గుర్తించిన అధికారులు, శిథిలాల్లో మరికొందరు చిక్కుక్కునో, చనిపోయో ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుల్లో కొందరు పిల్లలు కూడా ఉన్నారు. 40 మందికి కాలిన గాయాలు, శ్వాస సమస్యలు రావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమేమిటో ఇంతవరకు తెలియడం లేదు.