జపాన్లో భారీ భూకంపం.. సిటీలోకి సముద్రం నీళ్లు.. సునామీ హెచ్చరికలు జారీ
న్యూఇయర్ సెలబ్రేషన్స్ లో ఉన్న జపాన్ దేశాన్ని.. భారీ భూకంపం భయభ్రాంతులకు గురిచేసింది. గత పీడకలల్ను గుర్తుచేసింది. ఆదివారం జపాన్ లో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.5గా నమోదైంది. ఇషికావా కేంద్రంగా ఈ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. నీగాటా, టొయామా, యమగటా, ఫుకుమా, హ్యోగో, ప్రిఫెక్చర్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు ఇవ్వటంతోపాటు.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ క్రమంలో అలలు 5 మీటర్లకంటే ఎక్కువ ఎత్తులో ఎగసిపడే అవకాశం ఉందని.. ప్రజలు సముద్రానికి దూరంగా ఉండాలని సూచించింది.
భూకంపం తీవ్రత 7.5గా నమోదు కావడంతో అక్కడి ప్రజలు గత చేదు జ్ణాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. గతంలో జపాన్ లో సునామీ వచ్చినప్పుడు కూడా భూకంపం తీవ్రత 7.5గానే నమోదైంది. ఇప్పుడు కూడా సముద్రంలోనే భూకంపం రావడంతో.. ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని ప్రజలు వణికిపోతున్నారు. కొన్ని కొన్ని చోట్ల సముద్రపు అలలు సిటీల్లోకి వచ్చాయి. పూర్తి స్థాయిలో రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈలోపు తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
Waves starting to pick up in #japan pic.twitter.com/zPao34pLrq
— Liberty_Sean (@sharland57753) January 1, 2024