ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. 5సార్లు కంపించిన భూమి..

Byline :  Kiran
Update: 2023-10-07 11:23 GMT

ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.3గా నమోదైంది. భారీ భూప్రకంపనల కారణంగా చాలా భవనాలు కుప్పకూలాయి. ఈ ఘటనలో14 మంది ప్రాణాలు కోల్పోగా.. 78 మంది గాయాలపాలయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకొని ఉంటారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు..

ది యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం హీరత్కు 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 6.3 తీవ్రతతో వచ్చిన భూకంపం అనంతరం 5.5, 4.7, 6.3, 5.9, 4.6 తీవ్రతతో మరో నఐదు ప్రకంపనలు నమోదయ్యాయి. ఉదయం 11 గంటల సమయంలో భూ ప్రకంపనలు మొదలైన వెంటనే భవనాలు ఊగడం, గోడలు బీటలు వారడంతో జనం భయాందోళనలకు గురయ్యారు. ఇండ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

భూకంపం కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతింది. సెల్ ఫోన్ నెట్ వర్క్ లు పనిచేయలేదు. దీంతో చాలా మంది తమ కుటుంబసభ్యుల క్షేమ సమాచారం తెలియక ఆందోళన చెందారు. గ్రామీణ, కొండ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు అంటున్నారు. భూకంపం కారణంగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంకా పూర్తి స్థాయి సమాచారం అందలేదని చెప్పారు.




Tags:    

Similar News