స్కూల్‌పై దాడి... విద్యార్థులు సహా 41 మంది మృతి

Update: 2023-06-17 12:01 GMT

ఉగాండాలో దారుణం జరిగింది. అలైడ్​ డెమొక్రటిక్​ ఫోర్స్​ (ఏడీఎఫ్​) పశ్చిమ ఉగాండాలో మారణహోమం సృష్టించింది. ఓ స్కూల్పై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 38మంది విద్యార్థులతో పాటు మొత్తం 41మంది చనిపోయారు. మరికొంతమంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దుకు 1.2 మైళ్ల దూరంలో ఉన్న ఎంపాండ్వే పట్టణంలోని లుబిరిరా సెకండరీ స్కూల్లో ఈ దారుణం జరిగింది.

‘‘20 నుంచి 25 మంది తిరుగుబాటుదారులు లుబిరిరా సెకండరీ పాఠశాలపై దాడులు జరిపారు. అనంతరం వసతిగృహానికి నిప్పుపెట్టారు. ఇప్పటివరకు 41 మృతదేహాలను వెలికితీశాం. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఇక్కడి ఆహారాన్ని వారు దోచుకున్నారు. కొంతమందిని దుండగులు ఎత్తుకుపోయారు’’ అని పోలీసులు తెలిపారు. నిందితులు అక్కడి విరుంగా నేషనల్ పార్కు దిశగా పారిపోయినట్లు గుర్తించి.. ఆ దిశగా గాలింపు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.

1986 నుంచి అధికారంలో ఉన్న ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని పాలనను వ్యతిరేకిస్తూ 1995లో కాంగోలోని ఉగాండా ప్రవాసులు ఏడీఎఫ్‌ ను ఏర్పాటు చేశారు. 2001లో ఉగాండా ఎదురుదాడితో వారు తూర్పు కాంగోలోకి పారిపోయి అక్కడి నుంచి హింసకు తెగబడుతున్నారు. ఏడీఎఫ్‌కు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్తో కూడా సంబంధాలు ఉన్నాయి. 2020లో ఐక్యరాజ్యసమితి ఏడీఎఫ్‌ను హింసాత్మక గ్రూప్గా పేర్కొంది.


Tags:    

Similar News