బాబోయ్ భయమేస్తోంది...ఎవరు దాడి చేస్తున్నారో తెలియడం లేదు

Update: 2023-08-12 06:03 GMT

గ్రహాంతరవాసులు ప్రపంచంలో ఇంత ఇంట్రస్టింగ్ టాపింగ్ ఇంకొకటి ఉండదు. వీళ్ళు ఉన్నారా లేదా...ఉంటే ఎక్కడుంటారు, ఎలా ఉంటారు అనే విషయాల మీద ఏళ్ళకు తరబడి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు ఉన్నాయి, మేము చూశాము అంటారు...మరికొందరు అబ్బే అదంతా ఊహ, కల్పనే అంటారు. దీనికి అంతమే లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే....ఈ గ్రహాంతరవాసుల కలకలం మళ్ళీ రేగింది. పెరూలో ఏలియన్స్ తమ మీద దాడి చేస్తున్నారని అక్కడి జనాలు కంప్లైంట్స్ చేస్తున్నారు.

పెరూలోని ఈశాన్య ప్రాంతంలో ఆల్టో నానే అనే డిస్ట్రిక్ట్ ఉంది. ఇక్కడ గ్రహాంతరవాసులు ముసుగులు వేసుకుని వచ్చి మరీ జనాల మీద దాడులు చేస్తున్నాయిట. ఇవి ఏడడుగుల పొడవుతో ఉన్నాయని చెబుతున్నారు. చూడటానికి వింతగా...పసుపు రంగులో కళ్ళతో ఉన్నాయిట కూడా. మొదట ఈ వింత జీవిని చూసి ఓ అమ్మాయి అస్వస్థత గురియ్యిందట. అలాగే నల్లటి హుడీలు వేసుకుని వచ్చి ప్రజల మీద దాడులు కూడా చేస్తున్నాయి అని చెబుతున్నారు. ఇవి చాలా వింతగా ప్రవర్తిస్తున్నాయి అని కూడా అంటున్నారు. బాలిక మెడ మీద గాయం చేశాయి దాంతో ఆ అమ్మాయి చాలా భయపడిపోయిందని చెబుతున్నారు అక్కడి గిరిజన నాయకుడు జైరో రెటెగుయ్.

 మరోవైపు మరో గిరిజన ప్రాంతంలో నివసించే ఇకూటి జాతి ప్రజలు కూడా ఆల్టో నానే జిల్లా వాసుల మీద దాడులు చేస్తున్నారుట. సడెన్ జనాల మధ్యలోకి వచ్చి దాడి చేసి పారిపోతున్నారు. ఎదుటి వారి మొహానికి హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడి ఆల్టో నానే జిల్లాలో వారు చాలా భయపడిపోతున్నారు. ఇలా రెండు రకాలుగా తమ మీద దాడులు జరుగుండడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో గ్రామంలో వంతులవారిగా రాత్రిపూట కాపాలాకాస్తూ రక్షణగా ఉంటున్నారు. అయితే ఎవరు ఎప్పుడు చేస్తున్నారనేది గుర్తించలేకపోతున్నామని...ఆడవాళ్ళు, చిన్నపిల్లలే టార్గెట్ గా దాడులు చేస్తున్నారని చెబుతున్నారు.



Tags:    

Similar News