ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్‌ బ్యాగ్‌..ధర ఎంతో తెలుసా?

By :  Kiran
Update: 2023-07-31 09:55 GMT

ఆంటీలైనా...అమ్మాయిలైనా..బయటికి వస్తే మాత్రం కంపల్సరీ చేతిలో హ్యాండ్ బ్యాగులను క్యారీ చేయాల్సిందే. పక్కనే ఉన్న మార్కెట్‎కు వెళ్లినా ..పార్టీలకు అటెండ్ అయినా చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఉండాల్సిందే. కొంత మంది అవసరం కోసం హ్యాండ్ బ్యాగ్స్ వాడుతుంటే మరికొందరు స్టాటస్ కోసం వీటిని మైన్‎టైన్ చేస్తుంటారు. అందుకే మార్కెట్ లో రూ.100 మొదలు వేలు ఖరీదు చేసే బ్యాగులను తమ అవసరాలకు , ఫ్యాషన్ ట్రెండ్స్‎కు అనుగుణంగా కొంటుంటారు మగువలు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు, హీరోయిన్లు వాడే బ్యాగులు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. ఒక్కో బ్యాగు ఒక్కోసారి లక్షల విలువ పలుకుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఓ టీవీ నటి దగ్గర మాత్రం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ ఉంది. దాని ధర చెబితే మాత్రం ఎవరి మైండ్ అయినా బ్లాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బ్యాగ్ గురించే తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ ఒక్క బ్యాగ్ కోట్లు పలుకుతుందని తెలియగానే ఖంగుతుంటున్నారు.


అమెరికాకు చెందిన టీవీ నటి, మోడల్ కిమ్ కర్దాషియన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ హెడ్ లైన్స్‎లోనే ఉంటుంది. ఈ భామకు సంబంధించి ఏ వార్త వచ్చినా అది ట్రెండింగ్‏లో ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్‎డేట్ అయ్యే ఫ్యాషన్స్‎ను పాలో అవడంలో కిమ్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఈ బ్యూటీ ధరించే దుస్తుల నుంచి యాక్సెసరీస్‎ల వరకు ప్రతీది అత్యంత ఖరీదైనవిగా ఉంటాయి. అందుకే వాటి ధరలను తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతుంటారు.తాజాగా కిమ్ ఓ స్టేడియంలో సందడి చేసింది. ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఈ నటి చేతిలోని హ్యాండ్ బ్యాగ్ స్పెషల్ అట్రీక్షన్‎గా నిలిచింది. వెండి రంగులో ధగధగా మెరిిసోతున్న ఈ హ్యాండ్ బ్యాగ ధర అక్షరాలా రూ.3.12 కోట్లట. ధర తెలుసుకుని నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు.



ఏంటి ఈ బుడ్డి బ్యాగు ధర 3 కోట్లా అంతాల ఏముందని అని దీని గురించే ఆమె ఫాలోవర్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ బుడ్డి బ్యాగును హిర్మేస్ అనే సంస్థ తయారు చేసింది. దీని డిజైన్ చేసేందుకు బంగారాన్ని, డైమండ్‌ ను వినియోగించారట. ఇలాంటి బ్యాగు ప్రపంచంలో అతి కొద్ది మంది దగ్గర మాత్రమే ఉందని సమాచారం. కొంత మంది సెలబ్రిటీల కోసం స్పెషల్‌గా ఇలాంటి బ్యాగులను తయారు చేస్తుంటుంది ఈ కంపెనీ. ప్రస్తుతం ఇలాంటి బ్యాగులైతే మార్కెట్ లో లేవని తెలుస్తోంది. 

Tags:    

Similar News