MonaLisa Painting : మోనాలిసా పెయింటింగ్ పై సూప్ చల్లారు..ఎందుకంటే?

Update: 2024-01-29 03:33 GMT

ఫ్రాన్స్ లో రైతుల సమస్యలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫ్రాన్స్ లోని వ్యవసాయరంగ విధానాలకు వ్యతిరేకంగా..ఇద్దరు ఆందోళనాకారులు మోనాలిసా పెయింటింగ్ పై సూప్ చల్లి నిరసన తెలిపారు. అయితే ఆ పెయింటింగ్ ముందు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉండడంతో పెయింటింగ్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మన వ్యవసాయ రంగం చాలా దుర్భరంగా ఉండడంతో..రైతులు ప్రాణాలు కోల్పోతున్నారంటూ ఆందోళనాకారులు నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మ్యూజియం నుంచి సందర్శకులను ఖాళీ చేయించారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనకు కారణమైన ఇద్దరిని అరెస్టు చేశారు. ఆందోళనకారులు రిపోస్టే అలిమెంటైర్ అనే ఫ్రెంచ్ సంస్థకు చెందినవారిగా గుర్తించారు. ఆరోగ్యకరమైన ఆహారం ప్రతి ఒక్కరి హక్కు అంటూ నినాదాలతో హోరెత్తించారు.

అయితే 16వ శతాబ్దానికి చెందిన మోనాలిసా చిత్రపటం ఇప్పటికి అనేక సార్లు దాడులకు గురైంది. 1911లో ఈ పెయింటింగ్ ను ఓ మ్యూజియం ఉద్యోగి దొంగిలించాడు. 1950లో ఈ చిత్రపటంపై యాసిడ్ దాడి కూడా జరిగింది. అప్పటినుంచి దీన్ని బుల్లెట్ ప్రూఫ్ తో చేసిన గ్లాస్ షోకేస్ లో ఉంచి ప్రదర్శిస్తున్నారు. మెరుగైన జీతం, పన్నుల తగ్గింపు వంటివి డిమాండ్ చేస్తూ ఫ్రెంచ్ రైతులు రోజుల తరబడి నిరసనలు చేస్తుండడంతో..కొందరు నిరసనకారులు ఈ పని చేశారు. 2022లో కూడా మోనాలిసా పెయింట్ పై ఓ వ్యక్తి దాడి చేశాడు.




Tags:    

Similar News